పశువైద్య రంగంలో మరిన్ని పరిశోధనలు జరగాలి: తమిళిసై
మారుతున్న కాలానికనుగుణంగా పశువులు, పెంపుడు జంతువులలో వస్తున్న వ్యాధులను నయం చేయడానికి పశువైద్యులు పరిశోధనలు చేయాల్సిన అవసరముందని గవర్నర్‌ తమిళిసై అన్నారు. శుక్రవారం ఇక్కడ జరిగిన పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం ద్వితీయ వార్షికోత్సవంలో ఆమె ప్రసంగించారు. పశువులు, పెంపుడు జంతువుల్లో మూలకణ చికిత్స, కేన్సర్‌, లేజర్‌ సర్జరీ, ఆక్యుపక్చర్‌ విధానాలపై పరిశోధనలు జరగాల్సిన అవసరముందన్నారు. జనాభా కంటే పశువులు, పెంపుడు జంతువుల సంఖ్య ఎక్కువగా ఉందని, వాటికి తగ్గట్టు పరిశోఽధనలు జరగాల్సిన అవసరముందన్నారు.