నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో సాంకేతిక ఉత్సవ సందడి ప్రారంభమైంది. అంతఃప్రజ్ఞ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్మల్ కలెక్టర్ ప్రశాంతి, వర్సిటీ వీసీ అశోక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టణాలే కాదు.. గ్రామాలు కూడా స్మార్ట్ విలేజ్‌లుగా అభివృద్ధి చెందాలన్నారు. ఇప్పటి వరకు ఎక్కడా జరగని విధంగా బాసర ట్రిపుల్ ఐటీలో టెక్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు వర్సిటీ వైస్ చాన్స్‌లర్ డా.అశోక్ తెలిపారు.
బాసర ట్రిపుల్ ఐటీలో సాంకేతిక సంబరం