లాక్‌డౌన్ వలన ఆకలితో అలమటిస్తున్న కార్మికులని ఆదుకునేందుకు చిరంజీవి నేతృత్వంలో కరోనా క్రైసిస్ ఛారిటీ ఏర్పాటైన సంగతి తెలిసిందే. టాలీవుడ్ ప్రముఖులు దీనికి భారీ విరాళాలు అందిస్తున్నారు. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సి.సి.సికి రూ.20 లక్షల విరాళం ప్రకటించారు. గతంలో ఈయన కరోనా నిర్మూలన కోసం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ రాష్ట్రానికి కలిపి రూ. 1.25 కోట్ల విరాళాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇక అక్కినేని హీరో సుశాంత్ రెండు లక్షల విరాళాన్ని అందిస్తున్నట్టు పేర్కొన్నాడు. ఈ సమయంలో ఒకరినొకరు ఆదుకోవాలి. సంక్షభం వలన రోజువారీ కార్మికులు పడుతున్న ఇబ్బందులని గ్రహించి నా వంతు సహాకారం అందించాలని అనుకుంటున్నాను అని పేర్కొన్నారు . ఇక టాలీవుడ్ తారలు లాక్‌డౌన్‌లో భాగంగా ఇంట్లో ఉంటున్న వారందరిని అభినందిస్తూ ఓ వీడియో చేశారు. 21 రోజుల పాటు ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండాలని వారు కోరారు.