కరోనా మహమ్మారి ఎఫెక్ట్ అన్ని రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. వారు, వీరు అని తేడా లేకుండా...అందరినీ కష్టాలు తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా క్రీడారంగంపై దీని ప్రభావం మరింతగా ఉంటుంది. ఇప్పటికే పలు గేమ్స్, టోర్నీలు వాయిదా పడటంతో పాటు, మరికొన్ని రద్దయ్యాయి. ఈ ఎఫెక్ట్‌తో చాలా వరకు క్రికెట్ బోర్డులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. ఆర్థికంగా బలమైన బోర్డుగా పేరున్న ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు పరిస్థితి కూడా దయనీయంగా మారుతోంది. సంక్షోభం నుంచి బయటపడటం కోసం అనేక చర్యలను చేపడుతోంది. ఇందులో భాగంగానే జూన్ వరకు కొంత మంది ఉద్యోగులను తాత్కాలికంగా తొలిగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే అప్పటివరకు వారి ఉపాధి కోసం తమ స్పాన్సర్లను రిక్వెస్ట్ చేస్తోంది. లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో ఆర్థికంగా బలమైన బోర్డుగా పేరున్నఆసీస్ క్రికెట్ బోర్డు పరిస్థితే ఇలా ఉంటే.. మిగతా చిన్న, చిన్న బోర్డులు పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.